Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

అడుక్కుతింటున్నా ఆ దేశానికి బుద్దిరాదు... ఆర్థిక వ్యవస్థ పాతాళంలో ఉన్నా సోకులకు తక్కువే లేదు. తన ఇంటిని చక్కదిద్దుకోలేక పక్కింటిపై పడి ఏడవడం ఎప్పుడూ దానికి అలవాటే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 29, 2025 | 10:54 AMLast Updated on: Apr 29, 2025 | 10:54 AM

Pakistan Is Begging And Fighting With India

అడుక్కుతింటున్నా ఆ దేశానికి బుద్దిరాదు… ఆర్థిక వ్యవస్థ పాతాళంలో ఉన్నా సోకులకు తక్కువే లేదు. తన ఇంటిని చక్కదిద్దుకోలేక పక్కింటిపై పడి ఏడవడం ఎప్పుడూ దానికి అలవాటే.. పహల్గామ్ ఉగ్రదాడితో ఇప్పటికే మీ అందరికీ ఆ దేశం ఏదో అర్థమైపోయి ఉండాలి. అదే మన పక్కనే ఉన్న పాకీ పాక్… ఆ దేశం సంగతి ఎలా ఉందో చెప్పాలంటే అందుకు ఒకే ఒక్క ఎగ్జాంపుల్… డాలర్‌తో పోల్చితే పాక్ రూపాయి విలువ 3వందలు…. ఇప్పటికి మాత్రమే కొన్ని అంచనాలు నిజమైతే రానున్న రెండేళ్లలో అది 4వందలు దాటే అవకాశాలున్నాయి.పాకిస్తాన్ మనతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఉగ్రదాడితో 26ప్రాణాలు తీసిన ముష్కరులకు అండగా నిలిచిన దాయాది దేశం మనతో సమరానికి సై అంటోంది. భారత్ ఏమైనా కవ్వింపులకు దిగితే మేం అదే స్థాయిలో ప్రతిఘటిస్తాం అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తోంది. దేనికైనా రెడీ అంటూ బీరాలు పలుకుతోంది.

డాలర్తో పోల్చితే మన రూపాయి విలువ ఎంత…? 83 రూపాయలనో, 84 రూపాయలనో చెబుతాం. దానికే నానాగగ్గోలు పెడతాం. రూపాయి విలువ పడిపోతుందని గుండెలు బాదుకుంటాం. కానీ నిజానికి మన పరిస్థితి చాలా బెటర్. మన దాయాది పాక్‌ను తీసుకోండి చాలు డాలర్‌తో కంపేర్ చేస్తే పాక్ రూపాయి విలువ దాదాపు 3వందలు… ఆ దేశం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే.ద్రవ్యోల్బణం పెరిగిపోయింది…వ్యవసాయం పడకెక్కింది….పరిశ్రమలు మూతబడ్డాయి… ప్రస్తుతం పాక్ ఫైనాన్షియల్ కండిషన్ ఎంత దారుణంగా ఉందంటే సంక్షేమ కార్యక్రమాల సంగతి అల్లాకు ఎరుక… కనీసం ఉద్యోగులకు జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. నెలనెలా ఎవరో ఒకరిని పట్టుకుని అప్పు తెచ్చి ఇల్లు గడుపుకోవడం దానికి అలవాటుగా మారింది. ఒకప్పుడు భారత్‌కు మించిన వృద్ధిరేటుతో మంచి ఆర్థిక శక్తిగా ఎదిగిన పాక్ గాడి తప్పింది. పాలకులు చేసిన, చేస్తున్న తప్పిదాలు ఆ దేశాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. అప్పుల్లో ఎంతగా కూరుకుపోయిందంటే ఏటా వచ్చే రాబడి మొత్తాన్ని జీతాలు, పథకాలు అంటూ లేకుండా కట్టుకుంటూ పోయినా వందేళ్లపాటు అప్పు తీరదు.

పాక్ ఆదాయంలో దాదాపు 40-50 శాతం కేవలం వడ్డీలకే సరిపోతోంది. మిగిలినదాంట్లో మెజారిటీ సైనిక అవసరాలకు మళ్లుతోంది. ఆ దేశం జనం కోసం ఖర్చు చేసేది తక్కువ… ఉగ్రమూకలకు మేపేది ఎక్కువ. ప్రస్తుతం పాక్‌లో ద్రవ్యోల్బణం 40శాతం వరకు ఉంది. ఆ దేశం దగ్గరున్న విదేశీ నిల్వలు కేవలం 3.7బిలియన్ డాలర్లు. అంటే రెండు వారాల పాటు దిగుమతులకే సరిపోతాయి. ఆ తర్వాత అంటే ఈ లోపు ఎక్కడోచోట అడుక్కొచ్చుకోవడమే. ఈ ఏడాది అప్పులకు పాక్ చెల్లించాల్సింది 22 బిలియన్ డాలర్లు. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం ఘనా, నైజీరియా, శ్రీలంకల సరసన నిలిచింది పాక్ వృద్ధిరేటు.

ప్రజలు ఆకలితో చస్తున్నా వారికి కనీస సౌకర్యాలు కల్పించలేని పాక్ ఉగ్రవాదులకు తుపాకులు ఇచ్చి మరీ కశ్మీర్‌కు పంపుతోంది. ఇందుకోసం వేలకోట్లు ఖర్చు చేస్తోంది. పాకీ పాలకులు ఎందుకు ఇంత మూర్ఖంగా ఉన్నారంటే దానికి ఒక్కటే కారణం. తమ దేశ ప్రజల దృష్టి మరల్చడం. తమ వైఫల్యాలను తెరవెనక్కు నెట్టి మనపై పడి ఏడవడం వారికి బాగా అలవాటు. తప్పంతా భారత్‌దే, సోదర ముస్లింలకు సాయం చేస్తున్నా అని పైకి చెప్పుకుంటూ పాక్‌ను అప్పుల కొండగా మార్చేశారు.

ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయాలు పాక్ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చనున్నాయి. పాకిస్తాన్ జీడీపీలో వ్యవసాయం వాటా దాదాపు 40శాతం. అందులో ఎక్కువ భాగం సింధు జలాల నుంచి వచ్చేదే. ఇప్పుడు భారత్ ఆ నీటిని ఆపేస్తామనడంతో పాక్ గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. ఏ స్థాయిలో అంటే రాజకీయనాయకులు రోడ్లపైకి వస్తే జనం రాళ్లతో కొట్టి చంపేత ఆగ్రహంగా ఉన్నారు. పాక్‌కు మనం కొంచెం కొంచెంగా నీటి విడుదలను ఆపేస్తే ఇక ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పతనమవుతుంది. ఫలితంగా ఆ దేశం దివాళా తీయడం ఖాయం. కోరి కొరివితో తలగోక్కోవడం అనేది మన దగ్గరున్న సామెత. పాక్ ఉగ్రవాదం అనే కొరివిని నెత్తిన పెట్టుకుంది. చైనా దానికి పెట్రోల్ పోసి రగులుస్తోంది. దాని అవసరాల కోసం అది చలి కాచుకుంటోందని తెలియడం లేదు పాకిస్థాన్‌కు. అప్పుడప్పుడు పదో, పరకో ఇచ్చి ధర్మ ప్రభువు అన్నట్లు బిల్డప్ ఇస్తోంది. కానీ తాము అప్పుల ఊబిలోకి మరింతగా చిక్కుకుపోతున్నామని పాక్ ఏ మాత్రం ఊహించలేకోపోతోంది. పూర్తిగా మునిగేదాకా అది తెలుసుకోవడం కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే కుక్క తోక వంకర… అది సరి కాదు.. పాక్ బుద్దీ మారదు.