బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
ఇప్పుడున్న జనరేషన్లో నాని తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరైనా ఉంటారు అంటే అది శ్రీ విష్ణు మాత్రమే. మనోడి మీద ఈజీగా 15 కోట్ల పెట్టుబడి పెట్టొచ్చు..
ఇప్పుడున్న జనరేషన్లో నాని తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరైనా ఉంటారు అంటే అది శ్రీ విష్ణు మాత్రమే. మనోడి మీద ఈజీగా 15 కోట్ల పెట్టుబడి పెట్టొచ్చు.. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా కచ్చితంగా ఆ డబ్బులు వెనక్కి తిరిగి వచ్చేస్తాయి అని నమ్మకం నిర్మాతలలో కలిగించాడు ఈ హీరో. ఒకప్పుడు కమర్షియల్ కథలు కాకుండా.. రొటీన్ కథలకు దూరంగా సినిమాలు చేసేవాడు శ్రీ విష్ణు. ఈయన సినిమా అంటే సీరియస్ అని ఫిక్స్ అయిపోయే వాళ్ళు ఆడియన్స్. అందుకే కొన్నిసార్లు మంచి సినిమాలు వచ్చినా కూడా ప్రేక్షకులు చూడలేదు. అయితే రెండేళ్ల కింద వచ్చిన సామజవరగమన నుంచి తన స్టైల్ పూర్తిగా మార్చేశాడు శ్రీ విష్ణు. ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓం బీమ్ బుష్ సినిమాతో మరో హిట్టు కొట్టాడు. మధ్యలో స్వాగ్ కాస్త ట్రాక్ తప్పినా.. ఇప్పుడు సింగిల్ అంటూ వచ్చేస్తున్నాడు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది కాబట్టి అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. కథ బాగా నచ్చితే కానీ దాని మీద రూపాయి కూడా ఖర్చు పెట్టడు అల్లు అరవింద్. ఆయన డబ్బు పెట్టాడు అంటే సినిమాలో కథ బాగా బలంగా ఉంది అని అర్థం. అందులోనూ ఎంటర్టైన్మెంట్ సినిమా మీద ఆయన ఖర్చు పెట్టాడు అంటే కచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అని అర్థం చేసుకోవాలి. తాజాగా సింగిల్ ట్రైలర్ చూసిన తర్వాత హిట్టు కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మే 9న సినిమా విడుదల కానుంది. కచ్చితంగా ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొడతానని ధీమాగా చెబుతున్నాడు శ్రీ విష్ణు. ట్రైలర్ కూడా అదిరిపోయింది.. రెండున్నర నిమిషాల ట్రైలర్లో ఖతర్నాక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఈ ట్రైలర్లో టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ ను కూడా వదల్లేదు ఈ హీరో. స్క్రీన్ మీద శ్రీ విష్ణు ఉన్నాడంటే చాలు.. అతడి మర్మరింగ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మర్మరింగ్ అంటే బయటకు వినపడకుండా నోట్లోనే గునుక్కోవడం అన్నమాట.
అందులో పీహెచ్డీ పూర్తి చేశాడు శ్రీ విష్ణు. సెన్సార్ కత్తెరకు కూడా దొరకకుండా బూతులు మాట్లాడడంలో శ్రీ విష్ణు వారితేరిపోయాడు. సింగిల్ ట్రైలర్ లో కూడా బాలకృష్ణ, యానిమల్ లో రణబీర్ కపూర్ లతో పాటు ఇంకా చాలామందిని ఇమిటేట్ చేశాడు. అలాగే టైటిల్ సాంగ్ లో అల్లు అరవింద్, దిల్ రాజు డాన్సులను స్పూఫ్ చేశాడు. ఇందులో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కార్తీక్ రాజు దర్శకుడు. కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఇదే మాట అంటున్నారు. ఎలా చూసుకున్నా కూడా ఈ సమ్మర్ పూర్తిగా నవ్వుల పంట పండించే వరకు వదిలిపెట్టేలా లేడు శ్రీ విష్ణు.











