విశాఖలో సన్ రైజర్స్ తో మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్

ఐపీఎల్‌ 2025 సీజన్ ను సంచలన విజయంతో ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్ కు రెడీ అవుతోంది. మార్చి 30న విశాఖ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

  • Written By:
  • Publish Date - March 27, 2025 / 01:26 PM IST

ఐపీఎల్‌ 2025 సీజన్ ను సంచలన విజయంతో ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్ కు రెడీ అవుతోంది. మార్చి 30న విశాఖ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ జ‌ట్టుకు గుడ్ న్యూస్ అందింది. తొలి మ్యాచ్‌కు వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల దూర‌మైన స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్‌ జట్టుతో చేరాడు.

భార్య అతియాశెట్టి డెలివరీ కారణంగా లక్నోతో మ్యాచ్ కు రాహుల్ అందుబాటులో లేడు.ఇప్పుడు సన్ రైజర్స్ తో మ్యాచ్ కోసం రాహుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. రాహుల్ లేనిప్ప‌టికి తొలి మ్యాచ్ లో ఢిల్లీ బ్యాట‌ర్లు అదరగొట్టేశారు. 210 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఢిల్లీ చేధించింది. ఇప్పుడు రాహుల్ కూడా రావ‌డంతో ఢిల్లీ బ్యాటింగ్ లైన‌ప్ మ‌రింత ప‌టిష్టంగా మార‌నుంది.