ఐపీఎల్ తర్వాత బిజీబిజీగా టీమిండియా, బంగ్లా టూర్ షెడ్యూల్ రిలీజ్

ఐపీఎల్ తర్వాత టీమిండియా వరుస సిరీస్‌లు, టూర్లతో బిజీ బిజీగా గడపనుంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.

  • Written By:
  • Publish Date - April 15, 2025 / 08:55 PM IST

ఐపీఎల్ తర్వాత టీమిండియా వరుస సిరీస్‌లు, టూర్లతో బిజీ బిజీగా గడపనుంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. జూలై 31న లండన్‌లో మొదలయ్యే ఆఖరి టెస్టుతో ఈ టూర్ ముగియనుంది. ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత 10 రోజుల గ్యాప్‌లో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకి వెళ్లనుంది.. ఆగస్టు 17న మొదలయ్యే బంగ్లా టూర్‌లో టీమిండియా 3 వన్డేలు, 3 టీ20 మ్యాచులు ఆడుతుంది.. తాజాగా ఈ టూర్ షెడ్యూల్‌ని బీసీసీఐ విడుదల చేసింది.షెడ్యూల్ ప్రకారం.. భారత క్రికెట్ జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ఆగస్టు 17న తొలి వన్డే మీర్పూర్ వేదికగా ఆడనుంది. ఆగస్టు 20వ తేదీన మీర్పూర్ వేదికగానే రెండో వన్డే బంగ్లాదేశ్, భారత్ తలపడనున్నాయి. ఆగస్టు 23న చివరిదైన మూడో వన్డే చిట్టగాంగ్ వేదికగా జరగనుంది.

టీ20 సిరీస్ విషయానికొస్తే.. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 ఆగస్టు 26న జరగనుంది. చిట్టగాంగ్ వేదికగానే తొలి టీ20 నిర్వహించనున్నారు. ఆగస్టు 29న రెండో టీ20 మ్యాచ్, ఆగస్టు 31న మూడో టీ20 మ్యాచ్ లు మీర్పూర్ వేదికగా జరగనున్నాయి. టీ20 టీమ్‌కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన తర్వాత జరగబోయే మొట్టమొదటి టీ20 సిరీస్ ఇదే. దీంతో ఐపీఎల్‌ 2025 సీజన్‌లో సూపర్ పర్ఫామెన్స్ చూపిస్తున్న ప్రియాన్స్ ఆర్య వంటి కుర్రాళ్లకు ఈ సిరీస్‌లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే యంగ్ ప్లేయర్లతో పాటు సీనియర్లు శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ కూడా ఐపీఎల్ 2025 సీజన్‌లో దుమ్మురేపుతున్నారు. దీంతో వచ్చే ఏడాది జరిగే 2026 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి టీమ్‌ని సిద్ధం చేసేందుకు ఈ సిరీస్ నుంచే కోచ్ గంభీర్ శ్రీకారం చుట్టబోతున్నాడు.

ఇదిలా ఉంటే అక్టోబ‌ర్ నుంచి టీమిండియా వరుస సిరీస్ లతో బిజీగా ఉండనుంది. టీమిండియా హోం సీజన్ లో భాగంగా ఒక టీ20 విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతుంది. ఇండియా, సౌతాఫ్రికాల మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్ కు సాగ‌ర న‌గ‌రం విశాఖపట్నం వేదికైంది. అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు టీమిండియా హోం సీజన్ సిరీస్ ల షెడ్యూల్‌ను బీసీసీఐ ఇటీవల జూన్ లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత వెస్టిండీస్, సౌతాఫ్రికాల‌తో టీమిండియా సొంత గడ్డపై మ్యాచ్ ల‌ను ఆడ‌నుంది.