మహాలక్ష్మి సిద్దిస్తుంది: మోడీ కామెంట్స్

దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్‌ ఉంటుందన్నారు ప్రధాని మోడీ. రిఫార్మ్‌, పర్ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని తెలిపారు.

  • Written By:
  • Publish Date - January 31, 2025 / 03:02 PM IST

దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్‌ ఉంటుందన్నారు ప్రధాని మోడీ. రిఫార్మ్‌, పర్ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని తెలిపారు. పార్లమెంటులో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతున్నామన్నారు. పార్లమెంటులో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలని కేంద్ర బడ్జెట్‌ ద్వారా ప్రజలకు విశేష లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

కేంద్రం, రాష్ట్రం, ప్రజల సహకారంతో సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. సమృద్ధ, వికసిత్‌ భారత్‌ సంకల్పంతో ముందుకు సాగాలని వికసిత్‌ భారత్‌కు పార్లమెంటు మరింత బలం చేకూర్చుతుందన్నారు. పార్లమెంటు చర్చల్లో సభ్యులందరూ భాగస్వాములు కావాలని కోరారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్‌ ఉంటుందిని ఈ బడ్జెట్‌ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందన్నారు. మహాలక్ష్మి మనకు సిద్ధి, బుద్ధిని ఇస్తుందని వ్యాఖ్యానించారు.