బీఆర్ఎస్‌ పోస్టర్ల మీద పెయింటింగ్స్‌

వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ భారీ సభ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్‌ ఏర్పాటు చేసిన పోస్టర్ల మీద గుర్తు తెలియని వ్యక్తులు పెయింటింగ్‌లు వేశారు.

  • Written By:
  • Publish Date - April 22, 2025 / 02:01 PM IST

వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ భారీ సభ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్‌ ఏర్పాటు చేసిన పోస్టర్ల మీద గుర్తు తెలియని వ్యక్తులు పెయింటింగ్‌లు వేశారు. సభకు ఆహ్వానంగా బీఆర్ఎస్‌ పార్టీ.. వరంగల్‌లోని ఓఆర్‌ఆర్‌తో పాటు పాలు ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేసింది.

ఆ పోస్టర్ల మీద ఇప్పుడు పెయింటింగ్‌లు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ కార్యకర్తలే ఈ పని చేశారంటూ బీఆర్ఎస్‌ ఆరోపిస్తోంది. ఎలాగైనా సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నానా విధాలా ప్రయత్నిస్తోందని.. బీఆర్‌ఎస్‌కు సంబంధించిన సోషల్‌ మీడియా పేజెస్‌లో ప్రచారం జరుగుతోంది. సభా స్థలంలో పొలాలు పాడు చేస్తున్నారంటూ రైతులను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం కాంగ్రెస్‌ చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.