బ్రేకింగ్:పారిపోయిన పాక్‌ ఆర్మీ చీఫ్‌ ?

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకుంటుండటంతో పాకిస్తాన్ లో టెన్షన్ పెరిగిపోయింది. భారత్ చర్యలతో పాకిస్తాన్ కంగారు పడుతోంది.

  • Written By:
  • Publish Date - April 28, 2025 / 02:03 PM IST

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకుంటుండటంతో పాకిస్తాన్ లో టెన్షన్ పెరిగిపోయింది. భారత్ చర్యలతో పాకిస్తాన్ కంగారు పడుతోంది. ఈ నేపథ్యంలో పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ కనిపించకుండాపోయారు అనే వార్తలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే తన కుటుంబాన్ని దేశం దాటించేశాడు ఆసిమ్‌ మునీర్‌. ఇప్పుడు వాడు కూడా కనిపించకుండా పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే పాకిస్తాన్‌ మాత్రం దీన్ని కవర్‌ చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది.

ఆసిమ్‌ మునీర్‌ ఎక్కడికీ పారిపోలేదని.. పాకిస్తాన్‌లోనే ఉన్నాడు అనే చెప్పేలా ఓ ఫొటో రిలీజ్‌ చేసింది. రీసెంట్‌ పాక్‌ ఆర్మీ పాసింగ్‌ పరేడ్‌ ప్రధానితో పాటు ఆసిమ్‌ మునీర్‌ పాల్గొన్న ఫొటోను రిలీజ్‌ చేసింది. అయితే మనిషి కనిపించకుండా కేవలం ఫొటో మాత్రం రిలీజ్‌ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసిమ్‌ మునీర్‌ పాకిస్తాన్‌లోనే బంకర్‌లోకి వెళ్లిపోయాడు అనే వాదనలు మరోపక్క వినిపిస్తున్నాయి. రావల్పిండిలోని బంకర్‌లో ఆసిమ్‌ మునీర్‌ ఉన్నాడని చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఇండియా పాకిస్తాన్‌ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉన్న ఇలాంటి సమయంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ కనిపించకుండా పోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.