బ్రేకింగ్‌: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం ,2 గంటలు ఎవరూ బయటికి రావొద్దు…!

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ఎస్‌ఆర్ నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.

  • Written By:
  • Updated On - April 18, 2025 / 06:02 PM IST

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ఎస్‌ఆర్ నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. కోఠి, దిల్‌షుక్‌నగర్, అంబర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్‌లో సాధారణంగా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. దీంతో పాటు ఇది ఆఫీస్‌లు ముగిసే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షంలో తడుస్తూ రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరో రెండు గంటలపాటు ఇదే స్థాయిలో వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోనే కాకుండా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ కేంద్రం సూచించింది. ఇక ఈదురుగాలులు సైతం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందంది.