ఆ దేశాలకు టెస్ట్ హోదా ఎందుకు ? ఐసీసీకి ఇయాన్ ఛాపెల్ ప్రశ్న

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ ఐసీసీపై విమర్శలు గుప్పించాడు. అసోసియేట్ దేశాలకు టెస్ట్ హోదా ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

  • Written By:
  • Publish Date - January 28, 2025 / 04:04 PM IST

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ ఐసీసీపై విమర్శలు గుప్పించాడు. అసోసియేట్ దేశాలకు టెస్ట్ హోదా ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసోసియేట్ దేశాలకు టెస్ట్ హోదా అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఒక దేశానికి టెస్ట్ హోదా ఇవ్వడానికి ముందు నిర్దిష్ట ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.

ప్రస్తుతం తాలిబాన్ పాలనలో ఉన్న తమ దేశంలో ఆఫ్ఘనిస్థాన్ టెస్ట్ సిరీస్‌లకు ఆతిథ్యమివ్వగలదా అంటూ ప్రశ్నించాడు. అలాగే ఐర్లాండ్‌లో తగినంత టెస్ట్-స్టాండర్డ్ స్టేడియాలు ఉన్నాయా అన్నది అనుమానమేనని చెప్పాడు. హోదా ఇచ్చే విషయంలో సరైన ప్రమాణాలు పాటించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. కాగా ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లకు 2018లో టెస్ట్ హోదా లభించింది.