14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్

గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో సెంచరీతో విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యంత తక్కువ వయస్సులో

  • Written By:
  • Updated On - April 29, 2025 / 11:22 AM IST

గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో సెంచరీతో విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యంత తక్కువ వయస్సులో సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఇప్పటివరకు రియాన్ పరాగ్ పేరు మీద ఉన్న ఆ రికార్డును వైభవ్ చెరిపేశాడు. రియాన్ పరాగ్ 2019లో 17 సంవత్సరాల 175 రోజుల వయస్సులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సెంచరీ చేశాడు.

ఆ తర్వాత సంజూ శాంసన్ 2013లో ఆర్సీబీపై 18 సంవత్సరాల 169 రోజుల వయస్సులో.. పృథ్వీ షా 2018లో కేకేఆర్‌పై 18 సంవత్సరాల 169 రోజుల వయస్సులో సెంచరీ చేశాడు. అయితే వైభవ్ సూర్యవంశీ కేవలం 14 సంవత్సరాల 32 రోజుల వయస్సులోనే శతకం బాది వీరి రికార్డును దాటేశాడు. ఈ లిస్ట్‌లో వైభవ్, పరాగ్, సంజూ ముగ్గురూ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వారే.