పరువు నిలిపారు, ఐసీసీ టెస్ట్ టీమ్ లో ముగ్గురు

ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ లో ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... వైట్ బాల్ క్రికెట్ లో ఫ్లాప్ అయినప్పటకీ టెస్ట్ ఫార్మాట్ లో అదరగొట్టిన ముగ్గురు భారత ఆటగాళ్ళకు ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్

  • Written By:
  • Publish Date - January 25, 2025 / 02:45 PM IST

ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ లో ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… వైట్ బాల్ క్రికెట్ లో ఫ్లాప్ అయినప్పటకీ టెస్ట్ ఫార్మాట్ లో అదరగొట్టిన ముగ్గురు భారత ఆటగాళ్ళకు ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లో చోటు దక్కింది. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ కు ఎంపికయ్యారు. ఈజట్టుకు ఆసీస్ సారథి ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. కమ్మిన్స్ సారథ్యంలో ఆస్ట్రేలియా పలు చారిత్రక విజయాలను అందుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ భారత్ పై తొలి టెస్ట్ ఓడిన తర్వాత ఆసీస్ ను అద్భుతంగా నడిపించాడు. దీంతో కమ్మిన్స్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా 3-1తో సిరీస్ గెలుచుకుంది. గతేడాది ప్యాట్ కమిన్స్ 37 వికెట్లు తీయడంతో పాటు 25.53 సగటుతో 306 పరుగులు చేశాడు.

కాగా ఓపెనర్ గా యశస్వి జైశ్వాల్ చోటు దక్కించుకున్నాడు. 22 ఏళ్ల యశస్వి జైస్వాల్.. గతేడాది టెస్ట్‌ల్లో అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 54.74 సగటుతో 1474 పరుగులు చేసి భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 36 సిక్స్‌లు బాది ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్ట్‌ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే యశస్వి జైస్వాల్‌ను అత్యుత్తమ జట్టులో ఓపెనర్‌గా ఐసీసీ ఎంపిక చేసింది.అతనికి జతగా ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డక్కెట్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. గతేడాది టెస్ట్‌ల్లో బెన్ డక్కెట్ 1149 పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్స్‌ను చోటు దక్కించుకున్నాడు. గతేడాది కేన్ మామ 9 టెస్ట్‌ల్లో 59.58 సగటుతో 1013 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్‌కు చోటు దక్కింది. గత ఏడాది రూట్ రెడ్ బాల్ క్రికెట్ లో పరుగుల వరద పారించాడు. వరుస సెంచరీలతో రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. జోరూట్ 17 ఇన్నింగ్స్‌ల్లో 1556 పరుగులు చేశాడు.

ఐదో స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌‌ చోటు దక్కించుకున్నాడు. బ్రూక్ 12 టెస్ట్‌ల్లో 55 సగటుతో 1100 పరుగులు చేశాడు. ఆరో స్థానంలో శ్రీలంక బ్యాటర్ కామిందు మెండిస్ ఎంపికవ్వగా.. వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్ ప్లేయర్ జేమీ స్మిత్‌కు చోటు దక్కింది. కామిందు మెండిస్ 9 టెస్ట్‌ల్లో 74.92 సగటుతో 1049 పరుగులు చేయగా.. జేమీ స్మిత్ 9 మ్యాచ్‌ల్లో 637 పరుగులు నమోదు చేశాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు. స్పెషలిస్ట్ పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మ్యాట్ హెన్రీ చోటు దక్కించుకున్నాడు. బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే అతను 32 వికెట్లు పడగొట్టాడు.