ఒత్తిడితోనే ఫెయిలయ్యా ,తన బ్యాటింగ్ పై గిల్ కామెంట్స్

టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మితిమీరిన ఒత్తిడి కారణంగానే తాను సరిగా ఆడలేకపోయానని, అసవరమైనన్ని పరుగులు చేయలేకపోయానని చెప్పాడు.

  • Written By:
  • Publish Date - January 27, 2025 / 02:52 PM IST

టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మితిమీరిన ఒత్తిడి కారణంగానే తాను సరిగా ఆడలేకపోయానని, అసవరమైనన్ని పరుగులు చేయలేకపోయానని చెప్పాడు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో తన వైఫల్యానికి కారణాలను గిల్‌ నిజాయితీగా ఒప్పుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని తనపై తానే ఒత్తిడి పెట్టుకున్నానని, అందుకు తగ్గట్టుగా ఆడలేకపోవడంతో ఒత్తిడి పెరిగిపోయిందని గిల్‌ చెప్పాడు.

ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోవడంతో ఏకాగ్రత కోల్పోయి సరిగా ఆడలేకపోయానని గిల్‌ తెలిపాడు. రంజీ ట్రోఫీలో కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన గిల్.. ఇటీవల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో వైఫల్యం గురించి మాట్లాడాడు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆరు ఇన్సింగ్స్‌ ఆడి.. 18.60 సగటుతో గిల్‌ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు.