పాండ్యాతో గొడవలు లేవు సూర్యకుమార్ యాదవ్ క్లారిటీ

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్‌ను నియమించారు. దీంతో హార్థిక్ పాండ్యాకు ఇది షాక్ అనే చెప్పాలి.

  • Written By:
  • Publish Date - January 23, 2025 / 02:49 PM IST

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్‌ను నియమించారు. దీంతో హార్థిక్ పాండ్యాకు ఇది షాక్ అనే చెప్పాలి. గతంలో టీ20 జట్టును నడిపించిన హార్దిక్ పాండ్యాకు బదులు అక్షర్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించడంతో సూర్యకు, పాండ్యాకు విభేదాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను సూర్యకుమార్ ఖండించాడు. పాండ్యాతో తన రిలేషన్ బాగానే ఉందన్నాడు. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పాడు. జట్టుకు ఏం కావాలో తమకు బాగా తెలుసనీ, అక్షర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారన్నాడు. అయితే లీడర్‌షిప్ గ్రూపులో పాండ్యా కూడా భాగమేనని సూర్యకుమార్ చెప్పాడు. ప్రస్తుతం భారత జట్టుకు మైదానంలో చాలా మంది కెప్టెన్లు ఉన్నారని చెప్పుకొచ్చాడు.