రోహిత్ శర్మకు అరుదైన గౌరవం, వాంఖేడేలో హిట్ మ్యాన్ పేరిట స్టాండ్

  • Written By:
  • Publish Date - April 9, 2025 / 06:58 PM IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు అరుదైన గౌర‌వం ద‌క్క‌నుంది. ముంబై ఐకానిక్ వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరు మీద ఒక స్టాండ్ ఏర్పాటు చేసేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇటీవల జ‌రిగిన‌ స‌మావేశంలో ఎంసీఎ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

భార‌త కెప్టెన్‌గా అత‌డి విజ‌యాల‌ను ఈ ప్రత్యేక గౌరవంతో గుర్తించాల‌ని ఎంసీఎ భావిస్తోంది. అలాగే వాంఖ‌డే స్టేడియంలోని స్టాండ్స్‌, వాక్‌వేలకు శరద్ పవార్, దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, అజిత్ వాడేకర్, ఏక్‌నాథ్ సోల్కర్, దిలీప్ సర్దేశాయ్, డయానా ఎడుల్జీ వంటి దిగ్గ‌జాల పేర్లు పెట్టాల‌ని కొంత‌మంది ఎంసీఏ స‌భ్యులు సూచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై ఎంసీఏ త్వ‌ర‌లోనే ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసే అవ‌కాశ‌ముంది.