హైదరాబాద్ కు ఐపీఎల్ ఫీవర్, కొత్త జెర్సీ లాంఛ్ చేసిన సన్ రైజర్స్

క్రికెట్ ఫ్యాన్స్ కోసం సమ్మర్ కార్నివాల్ ఐపీఎల్ 18వ సీజన్ వచ్చేస్తోంది. మార్చి 22న ఆరంభమయ్యే ఈ లీగ్ కోసం అన్ని జట్లు ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - March 13, 2025 / 01:30 PM IST

క్రికెట్ ఫ్యాన్స్ కోసం సమ్మర్ కార్నివాల్ ఐపీఎల్ 18వ సీజన్ వచ్చేస్తోంది. మార్చి 22న ఆరంభమయ్యే ఈ లీగ్ కోసం అన్ని జట్లు ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాయి. ఈ సీజన్ ముంగిట స‌న్‌రైజ‌ర్స్‌ హైదరాబాద్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చింది. కొత్త సీజన్ కోసం కొత్త జెర్సీని లాంఛ్ చేసింది. గత సీజన్ మాదిరే ఉన్న ఈ జెర్సీలో డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేశారు. ఈ కొత్త జెర్సీలో ఆటగాళ్లు ఫొటలోకు ఫోజులిచ్చారు. జెర్సీని లాంఛ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్ గా మారింది.

రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మతో పాటు పలువురు ఆటగాళ్లు కొత్త జెర్సీలో ఫొటోలకు ఫోజులిచ్చారు. తగ్గేదేలే అంటూ పుష్ఫ స్టైల్లో స్టిల్స్ దిగారు. ఈ ఆటగాళ్ల ఫొటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో స‌న్‌రైజ‌ర్స్‌ హైదరాబాద్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఫ్రాంఛైజీ ఆటగాళ్ల ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. మెగా వేలంలో సొంతం చేసుకున్న ఆటగాళ్లతో స‌న్‌రైజ‌ర్స్‌ హైదరాబాద్ మరింత పటిష్ఠంగా మారింది. కెప్టెన్ కమిన్స్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ ను రిటైన్ చేసుకుంది. ఇక వేలంలో ఇషాన్ కిషన్, మహ్మద్ షమి, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా లాంటి ప్లేయర్లను తీసుకుంది.

డైనమైట్ లా పేలే ఇషాన్ కొత్త ఫ్రాంఛైజీ తరపున సత్తాచాటేందుకు రెడీ అవుతున్నాడు.గతేడాాది ఐపీఎల్ లో స‌న్‌రైజ‌ర్స్‌ హైదరాబాద్ విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ జట్టు ఓపెనర్లు హెడ్, అభిషేక్ మొదటి బంతి నుంచే ఊచకోతకు దిగడంతో రికార్డులు బద్దలయ్యాయి. ఈ సారి ఆ విధ్వంసాన్ని మరోస్థాయికి తీసుకెళ్లి ఉప్పల్ స్టేడియంలో పరుగుల మోత మోగించేందుకు స‌న్‌రైజ‌ర్స్‌ సిద్ధమవుతోంది. మార్చి 23న ఉప్పల్ లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ తో ఈ ఐపీఎల్ సీజన్ లో టైటిల్ వేటను స‌న్‌రైజ‌ర్స్‌ మొదలెట్టనుంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్‌ ప్రాక్టీస్ మొదలెట్టింది.