ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ,నెంబర్ వన్ గానే బుమ్రా

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. తాజాగా విడుదలైన జాబితాలోనూ బుమ్రా కెరీర్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ 908 రేటింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో నిలిచాడు.

  • Written By:
  • Updated On - January 24, 2025 / 07:04 PM IST

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. తాజాగా విడుదలైన జాబితాలోనూ బుమ్రా కెరీర్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ 908 రేటింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లతో నిలిచాడు. బోర్డర్‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన బుమ్రా గతంలో ఏ ఇండియా బౌలర్‌‌‌‌‌‌‌‌ సాధించని రేటింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 32 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ప్యాట్‌‌‌‌‌‌‌‌ కమిన్స్‌‌‌‌‌‌‌‌ , సౌతాఫ్రికా పేసర్‌‌‌‌‌‌‌‌ కగిసో రబాడ వరుసగా రెండు, మూడు ర్యాంక్‌‌‌‌‌‌‌‌ల్లో ఉన్నారు. మరోవైపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ నాలుగో ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్స్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో రవీంద్ర జడేజా నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను సాధించాడు.