బ్రేకింగ్: త్వరలో అఘోరీ, వర్షిణి పెళ్లి ?

అఘోరీ వర్షిణి వ్యవహారం సంచలన మలుపు తిరిగింది. త్వరలోనే అఘోరీ వర్షిణి పెళ్లి చేసుకోబోతున్నారని.. ఆ కారణంగానే వర్షిణిని అఘోరీ ట్రాప్‌ చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 7, 2025 / 03:30 PM IST

అఘోరీ వర్షిణి వ్యవహారం సంచలన మలుపు తిరిగింది. త్వరలోనే అఘోరీ వర్షిణి పెళ్లి చేసుకోబోతున్నారని.. ఆ కారణంగానే వర్షిణిని అఘోరీ ట్రాప్‌ చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అఘోరీకి వందల కోట్ల ఆస్తి ఉందని.. చాలా మంది పొలిటీషియన్స్‌కు పూజలు చేసి సొమ్ము చేసుకుందని సంచలన ఆరోపణలు చేశారు.

జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌ ఇంటి పక్కనే అఘోరీకి ఇల్లు కూడా ఉందని చెప్తున్నారు. రాత్రి సమయంలో అఘోరీ అక్కడే ఉంటోందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అఘోరీ ఇల్లు ఇదే అంటూ కొందరు ఇన్ఫ్యూయెన్సర్లు కూడా ఆ ఇంటి దగ్గర వీడియోలు చేశారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని.. తనను వర్షిణిని విడదీసేందుకు ఇదంతా చేస్తున్నారంటూ అఘోరీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ వర్షిణి కుటుంబ సభ్యులు మాత్రం అఘోరీ వ్యవహారాన్ని ఆధారాలతో చూపిస్తామంటూ చెప్తున్నారు.