చంద్రబాబును నమ్మితే చంద్రముఖిని లేపడమే: జగన్ సెటైర్లు…!

ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ వ్యతిరేక రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారని.. కాని ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు.

  • Written By:
  • Publish Date - January 8, 2025 / 12:59 PM IST

ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ వ్యతిరేక రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారని.. కాని ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. ప్రతి ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతోందని మనం ఇచ్చిన పథకాలను రద్దుచేశారు, అవి అమలు కావడంలేదన్నారు.

ప్రతి ఇంటికీ వెళ్లి చిన్నపిల్లలనుంచి పెద్దవాళ్ల వరకూ హామీలు గుప్పించారని చాలామంది శ్రేయోభిలాషులు వచ్చి.. చంద్రబాబులా హామీలు ఇవ్వాలని చెప్పారని రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలన్నారు. అలాంటి వారికే విలువ ఉంటుందని తెలిపారు. ఒక నాయకుడిగా మనం ఒక మాట చెప్పినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారన్న ఆయన ఆ మాట నిబెట్టుకున్నామా? లేదా? అని చూస్తారన్నారు. అమలు కాకపోతే.. ఆ నాయకుడి విలువ పోతుందని తెలిపారు.

అందుకనే మనం అబద్ధాలు చెప్పలేకపోయామన్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టో సందర్భంగా ప్రజంటేషన్‌ ఇచ్చానని.. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోను మనం అమలు చేశామన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడే ఏ నెల్లో ఏ క్యాలెండర్‌ అమలు చేస్తామో క్యాలెండర్‌ విడుదల చేశామని ఆయన వివరించారు. ప్రజల సంతోషం కోసం నిరంతరం తాపత్రయ పడ్డామన్నారు. మనం చేస్తున్న హామీలకు ఇంత ఖర్చు అవుతోంది, చంద్రబాబు హామీల అమలు చేయాలంటే రూ.1.72లక్షలకోట్లు ఇవ్వాలి అని చెప్పానని వివరించారు. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పానన్నారు.