ఆమెతో ఉన్న రిలేషన్‌, ఇదే క్లారిటీ ఇచ్చిన తోపుదుర్తి

తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ స్పందించారు. తాను కలిసి సుమయ తన బంధువుల అమ్మాయని.. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్‌ రాప్తాడుకు వస్తున్న కారణంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.

  • Written By:
  • Updated On - April 7, 2025 / 06:50 PM IST

తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ స్పందించారు. తాను కలిసి సుమయ తన బంధువుల అమ్మాయని.. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్‌ రాప్తాడుకు వస్తున్న కారణంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇలాంటి నీచ రాజకీయాలకు భయపడేది లేదంటూ.. సుమయతో తన కుటుంబ సభ్యులు ఉన్న ఫొటోలను కూడా పోస్ట్‌ చేశారు.

హీరోయిన్ సుమయ రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల ఓ ఎయిర్ పోర్ట్ లో కలసి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమయ రెడ్డి భుజంపై చేయి వేసి, ఆమెను దగ్గరకు తీసుకుని తోపుదుర్తి మాట్లాడిన వీడియో అది. ఆ వీడియోను వెనక నుంచి కొంతమంది షూట్ చేసినట్టు తెలుస్తోంది. దాన్నిప్పుడు కొందరు టీడీపీ అభిమానులుగా చెప్పుకుంటున్న వారు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం రచ్చ రచ్చగా మారింది.