పహల్గామ్‌ రక్తపాతానికి కారణం వీడే.. బ్యాగ్రౌండ్ తెలిస్తే.. మీరే చంపేస్తారు ?

సైఫుల్లా కసూరీ అలియాస్‌ ఖలీద్‌.. పహల్గామ్‌ దారుణం వెనక రాక్షసుడు వీడే ! పహల్గామ్‌ దాడికి తామే బాధ్యులమని.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - April 23, 2025 / 07:51 PM IST

సైఫుల్లా కసూరీ అలియాస్‌ ఖలీద్‌.. పహల్గామ్‌ దారుణం వెనక రాక్షసుడు వీడే ! పహల్గామ్‌ దాడికి తామే బాధ్యులమని.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పేరు TRFది అయినా.. దీని వెనక ఉన్నది కూడా పాకిస్తానే ! లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఇది పనిచేస్తుంది. ఆర్టికల్ 370రద్దు తర్వాత.. 2019 ఆగస్టులో ప్రారంభమైంది. లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేసే ఈ గ్రూప్.. కశ్మీర్‌లో భయాలు క్రియేట్‌ చేసేందుకు ఏర్పాటు చేశారు. స్టార్టింగ్‌లోనే ఇతర ఉగ్రవాద గ్రూపుల సభ్యులను.. TRF తనలోకి కలుపుకుంది. సోషల్ మీడియాను ఉపయోగిస్తూ.. భారత ప్రభుత్వంపై విద్వేషాన్ని ప్రేరేపిస్తోంది. 2023 జనవరిలో భారత హోం మంత్రిత్వ శాఖ ఈ సంస్థను.. ఉగ్రవాద గ్రూపుగా గుర్తించింది. UAPA చట్టం కింద TRFను నిషేధించడంతో.. ఇది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యాపారులు, పర్యాటకులు, పోలీసులే కాదు… సాధారణ జనాల మీద కూడా TRF టార్గెట్‌గా చేసుకుంటుంది.

FATF.. అంటే ఫైనాన్షియల్‌ యాక్షన్ టాస్క్‌ ఫోర్స్‌.. ఉగ్రవాదానికి మద్దతిస్తున్నారన్న కారణంతో 2018లో పాక్‌ను గ్రే లిస్టులో చేర్చింది. దీంతో ఆ తర్వాత లష్కరే తోయిబాపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగింది. ISI వ్యూహాత్మకంగా TRFను ప్రారంభించింది. ప్రకటించింది TRF అయినా.. పహల్గామ్ ఉగ్రదాడి వెనక కర్త, కర్మ, క్రియ.. పాక్‌ లష్కరే కమాండర్‌ ఖలీద్‌. లష్కరేలో ఖలీద్‌ కీలక వ్యక్తి. వాడి అసలు పేరు సైఫుల్లా కసూరి. అతడు భారత్ అతిపెద్ద శత్రువు, లష్కరే చీఫ్‌ అయిన హఫీజ్ సయీద్‌కు ఖలీద్‌ చాలా దగ్గర. లష్కరే సంస్థకు డిప్యూటీ చీఫ్‌గా పనిచేస్తున్నాడు. వీడిని ఓ అసెట్‌లా ఫీల్ అయ్యే పాక్‌ సర్కార్‌.. అన్ని రకాల మద్దతు ఇస్తుంటుంది. ఉగ్రవాద సంస్థకు సెకండ్‌ చీఫ్ అయినా.. పాక్ రోడ్ల మీద విలాసవంతమైన కార్లలో హాయిగా తిరుగుతుంటాడని టాక్‌. జిహాదీ స్పీచ్‌లు ఇవ్వడంలో స్పెషలిస్ట్‌. పాక్ సైన్యాన్ని రెచ్చగొట్టడమే కాదు.. యువతకు బ్రెయిన్ వాష్‌ చేసి.. ఉగ్రవాదంలోకి లాగుతుంటాడు.

గతంలో దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో.. ఖలీద్‌ పేరు తెరమీదకు వచ్చింది. రెండు నెలల కింద ఖైబర్ పంక్తుఖ్వాలో ఐఎస్‌ఐ, పాక్ ఆర్మీ కలిసి నిర్వహించిన మీటింగ్‌కు హాజరైన ఖలీద్‌.. 2026 ఫిబ్రవరి 2నాటికి కశ్మీర్ విముక్తి పొందుతుందంటూ ప్రతిజ్ఞ చేసినట్లు కథనాలు వినిపిస్తున్నాయ్. దానికోసమే పహల్గామ్‌లో దాడికి దిగారని తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని అబోటాబాద్ అడవుల్లో జరిగిన టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపులో వందల మంది పాక్ యువకులు పాల్గొన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంది. లష్కరే పొలిటికల్‌ వింగ్ అయిన PMML, SML ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ క్యాంప్ జరగగా.. దీనికి ఖలీద్ హాజరయ్యాడు. టెర్రరిస్ట్‌ అటాక్ కోసం ఆ క్యాంప్‌ నుంచి యువకులను సెలక్ట్ చేసి.. ఆ తర్వాత టార్గెట్ కిల్లింగ్‌ కోసం ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వాళ్లను పాక్ ఆర్మీ సాయంతో.. సరిహద్దు దాటించారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పహల్గామ్‌ దాడి వెనక ఉన్నది కూడా అలాంటి ఉగ్రవాదులే అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. ఈ దాడి వెనక ఖలీద్‌ కీలకపాత్ర పోషించాడు. 28మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నాడు. ఇంత జరిగినా.. పాకిస్తాన్‌ మాత్రం పత్తిత్తు వేషాలు వేస్తోంది. ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని బొంకుతోంది.