బ్రేకింగ్: మళ్ళీ యాత్రకు జగన్ రెడీ

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నానా ఇబ్బందులు పడుతోంది. పార్టీని వైఎస్ జగన్ ఎన్ని విధాలుగా ముందుకు తీసుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా అసలు పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు బయటకు వెళ్తారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

  • Written By:
  • Publish Date - November 29, 2024 / 07:10 PM IST

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నానా ఇబ్బందులు పడుతోంది. పార్టీని వైఎస్ జగన్ ఎన్ని విధాలుగా ముందుకు తీసుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా అసలు పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు బయటకు వెళ్తారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పర్యటనకు వైసీపీ అధినేత సిద్దమయ్యారు. నేరుగా కార్యకర్తలతోనే సమావేశం కానున్న జగన్… వారి కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు.

సంక్రాంతి తర్వాత నుండి పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ప్రతి బుధ, గురువారాలు కార్యకర్తలతోనే జగన్ గడిపే అవకాశం ఉంది. పార్టీ బలోపేతానికి వారి నుంచే సలహాలు, సూచనలు తీసుకోనున్న జగన్… కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ సమీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు మూడు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ అయి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.