బ్రేకింగ్‌: HCU విషయంలో తగ్గేదే లే బాంబు పేల్చిన స్మితా సబర్వాల్‌

HCU వ్యవహారంపై సోషల్‌ మీడియా పోస్టుల మీద IAS స్మితా సబర్వాల్‌ తగ్గేదే లే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఫేక్‌ వీడియోలు రీట్వీట్‌ చేశారన్న వ్యవహారంలో నోటీసులు అందుకు స్మితా..

  • Written By:
  • Publish Date - April 18, 2025 / 05:10 PM IST

HCU వ్యవహారంపై సోషల్‌ మీడియా పోస్టుల మీద IAS స్మితా సబర్వాల్‌ తగ్గేదే లే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఫేక్‌ వీడియోలు రీట్వీట్‌ చేశారన్న వ్యవహారంలో నోటీసులు అందుకు స్మితా.. ఇప్పుడు మరో రెండు వీడియోలు రీట్వీట్‌ చేశారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఆమె రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారారు. రీసెంట్‌గా HCUలో 400 ఎకరాలు వేలం వ్యవహారంలో కొన్ని సోషల్‌ మీడియా పోస్ట్‌లు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

అబద్ధపు వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం కొందరు వ్యక్తుల మీద కేసులు కూడా నమోదు చేసింది. ఈ వీడియోల్లో ఒక వీడియోను IAS స్మితా సబర్వాల్‌ కూడా రీట్వీట్‌ చేశారు. ఈ వ్యవహారంలో రీసెంట్‌గానే గచ్చిబౌలి పోలీసులు స్మితకు నోటీసులు జారీ చేశారు. దీంతో స్మితను విచారణకు పిలుస్తారని అంతా అనకున్నారు. కానీ పోలీసుల నుంచి నోటీసులు వచ్చినా స్మితా మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. HCUకు సంబంధించిన మరో రెండు వీడియోలను కూడా స్మిత రీట్వీట్‌ చేశారు. దీంతో ఇప్పుడు పోలీసులు తీసుకోబో యాక్షన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.