బ్రేకింగ్: లావుపై రజనీ రివేంజ్..? కేంద్రం అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ లిక్కర్ స్కాంకు సంబంధించి పార్లమెంట్లో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు

  • Written By:
  • Publish Date - March 27, 2025 / 07:07 PM IST

ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ లిక్కర్ స్కాంకు సంబంధించి పార్లమెంట్లో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యల తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపై నివేదిక కూడా తీసుకున్నారు. పలు ఆధారాలు కూడా అమిత్ షాకు అందించారు ఎంపీ.

ఇక ఇప్పుడు ఆయన భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా నిఘా వర్గాలు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆయనకు భద్రత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ పోలీస్ శాఖ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా పంపినట్లు సమాచారం. వైసీపీ శ్రేణులు లేదంటే ఇతర వ్యక్తులకు సంబంధించిన అభిమానులు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని నివేదిక పంపారు.

కాబట్టి ఆయనకు భద్రత పెంచాలని కోరినట్లు సమాచారం. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వపరంగా కల్పించాల్సిన భద్రతను కూడా ఆయనకు అందించేందుకు సిద్ధమైంది. ఆయన నివాసం వద్ద అలాగే ఆయన ఆఫీసు వద్ద, దానితోపాటు ఆయన పర్యటనలకు వెళ్లిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టనుంది.