నాకు ఒక్కడూ సపోర్ట్‌ చేయలేదు, హీరోలకు క్లాస్‌ పీకిన పవన్‌

రాజమండ్రిలో జరిగిన గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సింపుల్‌గా పవన్‌ కళ్యాణ్‌ వన్‌ మ్యాన్‌ షోలా అనిపించింది. చాలా రోజుల నుంచి తాను చెప్పాలి అనుకుంటున్న విషయాలను సందర్భం వచ్చింది కాబట్ట పవన్‌ బయటపెట్టేశారు అనిపించింది.

  • Written By:
  • Publish Date - January 6, 2025 / 05:28 PM IST

రాజమండ్రిలో జరిగిన గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సింపుల్‌గా పవన్‌ కళ్యాణ్‌ వన్‌ మ్యాన్‌ షోలా అనిపించింది. చాలా రోజుల నుంచి తాను చెప్పాలి అనుకుంటున్న విషయాలను సందర్భం వచ్చింది కాబట్ట పవన్‌ బయటపెట్టేశారు అనిపించింది. ఈ ఈవెంట్‌లో సినీ ఇండస్ట్రీ గురించి హీరోల గురించి కీలక కామెంట్స్‌ చేశాడు పవన్‌. అసెంబ్లీ ఎన్నికల్లో తాను వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ఒక్క హీరో కూడా తనకు అండగా నిలబడలేదని చెప్పాడు.

కేవలం హీరోలే కాదు.. ఇండస్ట్రీ నుంచి కూడా ఒక్కరు కూడా తనకు, ఎన్డీఏకు మద్దతు తెలపలేదంటూ సైలెంట్‌గా చురకలు అంటించారు. పవన్‌ స్పీచ్‌ చూసి ఇక ఏపీలో కూడా టికెట్‌ రేట్లు పెంచుకునే యోగ్యం లేనట్టే అని అంతా అనుకున్నారు. కానీ అదే స్పీచ్‌లో మళ్లీ సినిమాల విషయంలో క్లారిటీ ఇచ్చారు పవన్‌. సినిమా వాళ్లు తన దగ్గరకు వెళ్లలేదు కాబట్టి తాను కూడా దూరం పెట్టే ఆలోచన తనకు లేదన్నారు. ఎన్డీఏ సినీ ఇండస్ట్రీ నుంచి అలాంటివి ఆశించబోదని.. ఇండస్ట్రీ ఎదగాలని కోరుకుంటుందని చెప్పారు. సినిమా స్టార్స్‌ తనకు అండగా ఉన్నా లేకున్నా సినిమాలకు మాత్రం తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. త్వరలో రిలీజ్‌ కాబోతున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతిని కూడా ఇచ్చేశారు. ఇక నుంచి సినిమా షూటింగ్స్‌ ఏపీలో కూడా చేయాలని చెప్పారు పవన్‌. ఎప్పుడూ అవుట్‌డోర్‌ లొకేషన్స్‌ కాకుండా ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో కూడా సినిమా షూటింగ్స్‌ చేయాలని చెప్పారు. మన్యం లాంటి ప్రాంతాలను ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మన సినిమాలపై ఉందని చెప్పారు పవన్‌.