INS విక్రాంత్‌ను చూసి ఉ*చ్చ పోసుకుంటున్న పాకిస్థాన్‌, ఇండియన్‌ నేవీలో ఇదో లెవియథన్‌

INS విక్రాంత్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌.. పాకిస్థాన్‌ ప్యాంటు తడిపేస్తున్న పేరు ఇంది. ఇండియన్‌ నేవీలో ఇదొక బ్యాడ్‌ బాయ్‌. "క్యాపిటల్ షిప్" అని పిలుస్తారు.

  • Written By:
  • Publish Date - April 25, 2025 / 05:00 PM IST

INS విక్రాంత్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌.. పాకిస్థాన్‌ ప్యాంటు తడిపేస్తున్న పేరు ఇంది. ఇండియన్‌ నేవీలో ఇదొక బ్యాడ్‌ బాయ్‌. “క్యాపిటల్ షిప్” అని పిలుస్తారు. సుముద్ర మార్గంలో ఒక్కసారి ఇది ఎంటర్‌ అయ్యింది అంటే ఇక వార్‌ వన్‌ సైడ్‌. అలాంటి INS విక్రాంత్‌ పాకిస్థాన్‌ మీద దండయాత్రకు బయల్దేరింది. రాఫెల్‌ యుద్ధ విమానాలతో శతృ దేశం వైపు దూసుకెళ్తోంది. దీంట్లో ఉండే మిగ్‌-29K యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో గస్తీ కాయడమే కాకుండా శతృ నౌకలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ముఖ్యంగా దీని మిగ్‌-29K ఫైటర్ జెట్‌లు పాకిస్తాన్ నావికా స్థావరాలు, ఓడరేవులు, వ్యూహాత్మక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయగలవు. సింపుల్‌గా చెప్పాలంటే ఇండియా ఏకంగా ఓ ఎయిర్‌ బేస్‌ సముద్రంలో తేలుతూ పాకిస్థాన్‌ మీద దాడికి వచ్చినట్టే.

INS విక్రాంత్ నిర్మాణం 1999లో డిజైన్ పనులతో ప్రారంభమైంది. కానీ కొన్ని పనుల్లో ఆలస్యం కారణంగా 2022లో దీన్ని లాంచ్‌ చేశారు. కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్.. కేరళలో నిర్మించబడింది INS విక్రాంత్‌. ఇది భారతదేశంలో నిర్మితమైన మొదటి విమాన వాహక నౌక. దాదాపు 23 వేల కోట్లు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారు. ప్రారంభంలో 2010లో లాంచ్, 2016లో కమీషన్ కావాల్సి ఉండగా, గేర్‌బాక్స్‌ల సరఫరా ఆలస్యం, రష్యా నుండి విమాన వసతుల ఆలస్యం, సాంకేతిక సమస్యల వల్ల 2022 వరకు ఆలస్యమైంది దాదాపు 76% స్వదేశీ భాగాలతో నిర్మించబడింది INS విక్రాంత్‌. 500 భారతీయ కంపెనీలు, 100 MSMEలు నిర్మాణంలో పాల్గొన్నాయి.

వార్‌షిప్ గ్రేడ్ స్టీల్‌ని.. SAIL మరియు DMRL సంయుక్తంగా తయారు చేశాయి. రక్షణ పరంగా INS విక్రాంత్‌ భారతదేశాన్ని US, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల సరసన చేర్చింది. 43 వేల టన్నులు బరువు, 262 మీటర్ల పొడవు, 62 మీటర్లు వెడల్పు, 59 మీటర్ల ఎత్తుతో INS విక్రాంత్‌ సముద్రంలో ఓ లెవియథాన్‌లా కనిపిస్తుంది. 12 వేల 500 చదరపు మీటర్ల వైశాల్యంలో రెండున్నర హాకీ మైదానాల సైజులో ఉంటుంది దీని డెక్‌. 4 జనరల్ ఎలక్ట్రిక్ LM2500+ గ్యాస్ టర్బైన్లు, 88 మెగా వాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. గంటకు 52 కిలో మీటర్ల వేగంతో ఇది సముద్రంలో ప్రయాణిస్తుంది.

7 వేల 500 వందల కిలో మీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ఒకేసారి మోసుకెళ్లగలదు. 1971లో మాజీ INS విక్రాంత్ చిట్టగాంగ్, కాక్స్ బజార్‌లో పాకిస్తాన్ ఓడలను ముంచివేసినట్లే, ప్రస్తుత విక్రాంత్ కూడా అంతే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా సముద్ర మార్గంపై ఆధారపడుతుంది. విక్రాంత్ ద్వారా విధించబడే నావికా అడ్డంకి, పాకిస్తాన్‌కు ఇంధనం, వస్తువుల సరఫరాను తీవ్రంగా దెబ్బతీస్తుంది. పాకిస్తాన్ నావికాదళంలో ఫ్రిగేట్‌లు, కార్వెట్‌లు, సబ్‌మెరైన్‌లు ఉన్నాయి. కానీ ఇవి విక్రాంత్‌ ముందు జూజూబీ. విక్రాంత్ యొక్క గగనతల శక్తి, CBG సహకారంతో ఈ నౌకలను సమర్థవంతంగా నాశనం చేయవచ్చు. ఒకవేళ పాకిస్తాన్‌కు చైనా మద్దతు పలికి తన యుద్ధనౌకలు, జలాంతర్గాములను పంపిస్తే భారత నావికాదళానికి సవాలుగా ఉండవచ్చు. కానీ అలాంటి సదర్భంలో క్వాడ్ ఒప్పందం ప్రకారం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఇండియా తరఫు నుంచి రంగంలోకి దిగుతాయి. దీంతో ఎలా చూసినా పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి వస్తే విక్రాంత్‌ చేసే విధ్వంసం ముందు పాకిస్థాన్‌ తల వంచాల్సిందే.