బ్రేకింగ్‌: స్మితా సబర్వాల్‌కు నోటీసులు

AS స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో AI వీడియోను రీట్వీట్‌ చేశారంటూ.. 179 BNS ప్రకారం గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు

  • Written By:
  • Publish Date - April 16, 2025 / 04:28 PM IST

AS స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో AI వీడియోను రీట్వీట్‌ చేశారంటూ.. 179 BNS ప్రకారం గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ట్వీట్‌ విషయంలో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. HCUలో చెట్ల నరికివేతకు సంబంధించిన ఓ AI వీడియో ఇంటర్నెట్‌ను షేక్‌ చేసింది.

ఈ వీడియో ద్వారా ఫేక్‌ సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ వీడియో పోస్ట్‌ చేసినవాళ్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇదే కేసులో బీఆర్ఎస్‌ నేత మన్నే క్రిశాంక్‌ను కూడా పోలీసులు విచారించారు. ఇప్పుడు ఇదే వీడియోను రీట్వీట్‌ చేశారంటూ IAS స్మితా సబర్వాల్‌కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.