Spl story: ఆట మొదలెట్టిన కూటమి.. వైసీపీకి ఇత్తడే

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి అన్ని వైపుల నుంచి చుక్కలు చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేసిన వైసిపి నేతలు..

  • Written By:
  • Publish Date - April 26, 2025 / 06:44 PM IST

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి అన్ని వైపుల నుంచి చుక్కలు చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేసిన వైసిపి నేతలు.. ఇప్పుడు జాగ్రత్తగా పడుతున్నారు. ఎవరు ఊహించని విధంగా లిక్కర్ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయటికి తీయడంతో వైసిపి మానసికంగా కూడా ఇబ్బందులు పడుతోంది. ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులు ఎప్పుడూ ఎవరిని అదుపులోకి తీసుకుంటారు అర్థం కాక ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. కొంతమంది నాయకులు టిడిపి తో రాజీ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు అర్థమవుతుంది.

అప్పట్లో లోకేష్ చేసిన వార్నింగ్ ను తక్కువ అంచనా వేసిన వైసిపి నాయకులు ఇప్పుడు ఫలితం చూస్తున్నారు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మొత్తం నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు అనేది రాజకీయ వర్గాల మాట. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున ముడుపులు వెళ్లాయి అనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి ప్రతి సాక్ష్యాన్ని, సహకరించిన మంత్రి నారా లోకేష్ అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

లిక్కర్ కుంభకోణంలో ఇంకెవరెవరు ఉన్నారు అనేదాన్ని… ప్రతి ఒక్కటి లోకేష్ ఆధారాలు సేకరించిన తర్వాతే కేసులో కీలక అడుగులు పడుతున్నాయి. లిక్కర్ కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసే విషయంలో కూడా లోకేష్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అన్ని వైపుల నుంచి కసిరెడ్డి పై పోలీసులు ఒత్తిడి తెచ్చే విధంగా లోకేష్ ఒక పథకం ప్రకారం అడుగులు వేసినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి న్యాయస్థానాల్లో కూడా అన్ని విధాలుగా ప్రూవ్ చేసేందుకు గతంలో జరిగిన తప్పులపై ఆధారాలను సేకరించి పెట్టుకున్నారు.

ఇదే ఇప్పుడు వైసీపీని ముప్పతిప్పలు పెడుతుంటే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. చిత్తూరు జిల్లాలో అటవీ భూములను పెద్ద ఎత్తున ఆక్రమించారు అనే ఆరోపణలు పత్రికల్లో రావడంతో ఇప్పటికే అటవీశాఖ విచారణ చేస్తోంది. ఇక తాజాగా షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ విషయంలో కూడా ఇదే దూకుడు ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్యంత కీలక నాయకుడు. రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీకి ఆయనే కొండంత బలం.

ఇప్పుడు ఆయనను కూడా అరెస్టు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మదనపల్లి ఫైల్స్ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే దీనిపై మరి కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ వైసీపీని అన్ని వైపుల నుంచి టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వ పెద్దలు సీరియస్ ఫోకస్ పెట్టడంతో పోలీసులు కూడా నిందితులను అరెస్టు చేసే విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరి వైసీపీలో త్వరలో ఎవరు అరెస్టు కాబోతున్నారనేది చూడాలి.