ఆడు అల్లుడు ఈడు కొడుకు: కోమటిరెడ్డి సెటైర్లు

కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్లు వేసారు. నేను ఎక్కడైనా గంటసేపు నిలబడితే 5 వేల మంది జనం వస్తారని మా సమావేశాల్లో పల్లీలు, ఐస్ క్రీమ్లు అమ్ముకునే అంత జనం కూడా కేటీఆర్ మహా ధర్నా లో లేరన్నారు.

  • Written By:
  • Publish Date - January 29, 2025 / 01:12 PM IST

కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్లు వేసారు. నేను ఎక్కడైనా గంటసేపు నిలబడితే 5 వేల మంది జనం వస్తారని మా సమావేశాల్లో పల్లీలు, ఐస్ క్రీమ్లు అమ్ముకునే అంత జనం కూడా కేటీఆర్ మహా ధర్నా లో లేరన్నారు. అసలు ఏ మొహం పెట్టుకుని కేటీఆర్ నల్గొండకు వచ్చిండు ? అని ప్రశ్నించారు. నల్గొండలో ఫ్లోరైడ్ ను పదేళ్ల పాటు పెంచి పోషించిందే వాళ్ళు కదా అంటూ మండిపడ్డారు.

మానవత్వం లేని మనిషి రూపంలో ఉన్న మృగాలు వాళ్లు అని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు.. నా కాలి గోటికి సరిపోరు అని ఎద్దేవా చేసారు. కేసీఆర్ అల్లుడిగా హరీష్ రావు నాయకుడు అయ్యాడని కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ లీడర్ అయ్యాడన్నారు. నేను, రైతు బిడ్డగా నాయకుడిని అయ్యానని తెలిపారు. సిరిసిల్లలో, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ వచ్చిందని కానీ నా నియోజకవర్గం నల్గొండలో, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 60 వేల మెజారిటీ వచ్చిందని తెలిపారు.