దాన్ని అరెస్ట్‌ చేసి బొక్కలో వేయండి..!

తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన అఘోరీ నాగసాధు మీద జోగినీలు ఫిర్యాదు చేశారు. తమ వర్గం పరువు తీసేలా అఘోరీ వ్యవహరిస్తోందని శామీర్‌పేట్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

  • Written By:
  • Publish Date - April 17, 2025 / 12:41 PM IST

తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన అఘోరీ నాగసాధు మీద జోగినీలు ఫిర్యాదు చేశారు. తమ వర్గం పరువు తీసేలా అఘోరీ వ్యవహరిస్తోందని శామీర్‌పేట్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తూ అమాయకులను మోసం చేస్తోందని ఆరోపించారు.

మాయ మాటలతో అమ్మాయిలను కూడా మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే అఘోరీ కారణంగా చాలా మంది అమ్మాయి మోసపోయారని.. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అఘోరీని అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. జోగినీ సంధ్య ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న శామీర్‌పేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.