అర్ధం చేసుకోండి: చంద్రబాబు సంచలనం

పథకాల అమలు ఆలస్యం పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 2019-24 లో నేను ఊహించిన దానికంటే రాష్ట్రానికి ఎక్కువ డ్యామేజ్ జరిగిందన్నారు. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని తెలిపారు.

  • Written By:
  • Publish Date - January 27, 2025 / 06:38 PM IST

పథకాల అమలు ఆలస్యం పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 2019-24 లో నేను ఊహించిన దానికంటే రాష్ట్రానికి ఎక్కువ డ్యామేజ్ జరిగిందన్నారు. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని తెలిపారు. వెంటిలేటర్ పై నుంచి బయటపడేశాం కానీ పరిగెత్తించలేకున్నామని అన్నారు. ఇంకా పథకాలు ప్రారంభం కాలేదని కొందరు అంటున్నారన్నారు.

మూడు సార్లు ముఖ్యమంత్రి చేశా కానీ ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా అన్నారు చంద్రబాబు. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. కొంచెం ఆలస్యం అవుతుంది, అవకాశం లేదన్నారు. కేంద్రం కొంత ఆదుకోబట్టి కొంత కోలుకోగలిగామని అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా రివైవల్ అయ్యేది కాన్నారు. గత నాలుగు సంవత్సరాల ఫలితాల వల్ల ఈ ఏడాది కూడా ఆదాయం రాదన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. సంపద పెంచి ఆ లబ్ధి అంతా ప్రజలకే అందిస్తామని తెలిపారు. చెప్పిన హామీలు మాత్రమే కాకుండా మెరుగైన పాలన ఇస్తామన్నారు.