తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, కొత్త మంత్రులు వీళ్లే

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్వరలోనే తెలంగాణలో మంత్రివర్గం విస్తరణ జరగబోతోంది. ఈ విస్తరణలో మొత్తం 5 మంత్రి పదవులు భర్తీ చేసేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది

  • Written By:
  • Publish Date - March 24, 2025 / 01:13 PM IST

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్వరలోనే తెలంగాణలో మంత్రివర్గం విస్తరణ జరగబోతోంది. ఈ విస్తరణలో మొత్తం 5 మంత్రి పదవులు భర్తీ చేసేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరి మంత్రిత్వ శాఖలు కూడా మారే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీరణాలపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్‌ పెద్దలు టీపీసీసీ నేతలకు పిలుపునిచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం ఇస్తే బాగుంటుందనే విషయంపై పార్టీ హై కమాండ్‌.. సీఎం, డిప్యుటీ సీఎంతో చర్చలు జరపనుంది. మరోవైపు మంత్రి పదవి ఆశిస్తున్న కీలక నేతలంతా ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఈ విస్తరణలో ఎలాగైన పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిజానికి ఈ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విస్తరణ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు ఫైనల్‌గా విస్తరణపై కసరత్తు మొదలు కావడంతో ఆశావహులంతా అధిష్టాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.