2 సార్లు లింగ మార్పిడి, అఘోరీ మెడికల్‌ టెస్టులో సంచలనాలు

చీటింగ్‌ కేసులో అరెస్టైన అఘోరీ నాగసాధు మెడికల్‌ టెస్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అఘోరీ గతంలో రెండు సార్లు లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నట్టు గుర్తించారు డాక్టర్లు.

  • Written By:
  • Publish Date - April 24, 2025 / 02:47 PM IST

చీటింగ్‌ కేసులో అరెస్టైన అఘోరీ నాగసాధు మెడికల్‌ టెస్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అఘోరీ గతంలో రెండు సార్లు లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నట్టు గుర్తించారు డాక్టర్లు. ప్రస్తుతం అఘోరీ ట్రాన్స్‌జెండర్‌ కావడంతో ఆమెను జైలులో ఉంచుకునేందుకు చేవెళ్ల జైలు అధికారులు నిరాకరించారు.

ట్రాన్స్‌ జెండర్లను ఉంచేందుకు ప్రత్యేక బ్యాకర్‌ ఉందని ఆ బ్యాకర్‌ కూడా కేవలం చంచల్‌గూడ జైలులో మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు. దీంతో పోలీసులు అఘోరీని చంచల్‌గూడకు తరలించారు. అయితే రెండు సార్లు అఘోరీ ఎందుకు లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.