బ్రేకింగ్: గుండెలో 3 వాల్వ్స్‌ బ్లాక్‌, కొడాలికి సీరియస్‌ ?

మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటున్నారు ఆయనకు వైద్యం చేసిన డాక్టర్లు. హైదరాబాద్‌ AIG హాస్పిటల్‌లో కొడాలికి చికిత్స చేసిన డాక్టర్లు ఆయన గుండెలో మూడు వాల్వ్స్‌ బ్లాక్‌ అయినట్టు చెప్తున్నారు.

  • Written By:
  • Updated On - March 31, 2025 / 06:30 PM IST

మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటున్నారు ఆయనకు వైద్యం చేసిన డాక్టర్లు. హైదరాబాద్‌ AIG హాస్పిటల్‌లో కొడాలికి చికిత్స చేసిన డాక్టర్లు ఆయన గుండెలో మూడు వాల్వ్స్‌ బ్లాక్‌ అయినట్టు చెప్తున్నారు. దీని వల్ల బ్లడ్‌ సర్క్యూలేషన్‌లో కూడా ఇబ్బంది తలెత్తినట్టు చెప్తున్నారు. వెంటనే నానికి ఆపరేషన్‌ చేయాలని దీని కోసం ముంబైకి వెళ్లాలని సూచించారు. డాక్టర్ల సూచనతో నానిని వెంటనే ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు ఆయన కుటుంబ సభ్యులు.

ముంబైలోని ఏషియన్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌లో నానికి ఆపరేషన్‌ జరగబోతోంది. హైదరాబాద్‌ నుంచి వెళ్లే ముందే నానికి యాంజియోగ్రామ్‌ టెస్ట్‌లు కూడా నిర్వహించారు డాక్టర్లు. హార్ట్‌ స్టంట్‌ వేస్తే సరిపోతుందా లేదంటే బైపాస్‌ సర్జరీ చేయాలనే విషయం ఏషియన్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ డాక్టర్లు నిర్ణయించబోతున్నారు. గతంలో కూడా ఛాతీ నొప్పితో హాస్పిటల్‌లో చేరారు కొడాలి నాని. అప్పటి నుంచి ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే ఉన్నారు.

రీసెంట్‌గా తీవ్రంగా గుండె నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో చేరారు. మాజీ మంత్రి పేర్ని నాని సహా వైసీపీ నేతలు హాస్పిటల్‌లో నానిని పరామర్శించారు. కొన్ని రోజుల ట్రీట్‌మెంట్‌ తరువాత నానిని డిశ్చార్జ్‌ చేస్తారని వైసీపీ నేతలు చెప్పారు. కానీ పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆయనను ముంబైకి వెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ కార్యకర్తలు నేతల్లో నాని ఆరోగ్యంపై ఆందోలన నెలకొంది.