బ్రేకింగ్:ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు 26 రాఫెల్‌ జెట్‌లు

ఫ్రాన్స్ తో భారత్ భారీ డీల్ కుదుర్చుకుంది. 63 వేల కోట్ల రూపాయలతో 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఆమోదం తెలిపింది. రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు డిఫెన్స్ వర్గాలు తెలిపాయి.

  • Written By:
  • Publish Date - April 26, 2025 / 12:22 PM IST

ఫ్రాన్స్ తో భారత్ భారీ డీల్ కుదుర్చుకుంది. 63 వేల కోట్ల రూపాయలతో 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఆమోదం తెలిపింది. రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్ నుంచి భారత నావికాదళం 22 సింగిల్-సీటర్ జెట్లతో పాటు నాలుగు ట్విన్-సీటర్ యుద్ధ విమానాలను పొందనుంది. అంతేకాదు ఆఫ్‌సెట్ బాధ్యతల కింద ఫ్లీట్ నిర్వహణ, లాజిస్టికల్ సపోర్ట్, సిబ్బంది శిక్షణ, స్వదేశీ తయారీ భాగాల కోసం సమగ్ర ప్యాకేజీని అందుకుంటుంది.

నేవీ సిబ్బందికి శిక్షణ కూడా ఈ ఒప్పందంలో భాగమే. INS విక్రమాధిత్య, INS విక్రాంత్‌ నుంచి ఆపరేట్‌ చేసే విధంగా ఈ రాఫెల్‌ జెట్లను డిజైన్‌ చేశారు. ఇవి సముద్రంలో ఇండియన్‌ నేవి శక్తిని గణనీయంగా పెంచుతాయి. ఏప్రిల్‌ 28న ఈ డీల్‌ మీద ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి. ఇండియా పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఫ్రాన్స్‌ డిఫెన్స్‌ మినిస్టర్‌ వర్చువల్‌గా పాల్గొనబోతున్నారు. ఈ సంతకాల తరువాత 4 ఏళ్లలో జెట్‌లు ఇండియాకు అందిస్తుంది ఫ్రాన్స్‌. అంటే 2029 కల్లా భారత అమ్ముల పొదిలో 26 రాఫెల్‌ జెట్లు చేరబోతున్నాయి.