వరుసగా నాలుగో సెంచరీ, దుమ్మురేపుతున్నమయాంక్

జాతీయ జట్టుకు దూరమైన మయాంక్ అగర్వాల్ ఇటీవల ఐపీఎల్ వేలంలోనూ అన్ సోల్డ్ గా మిగిలాడు.ఈ కర్ణాటక బ్యాటర్ గురించి అందరూ మర్చిపోయిన తరుణంలో ఒక్కసారిగా దూసుకొచ్చాడు.

  • Written By:
  • Publish Date - January 6, 2025 / 09:02 PM IST

జాతీయ జట్టుకు దూరమైన మయాంక్ అగర్వాల్ ఇటీవల ఐపీఎల్ వేలంలోనూ అన్ సోల్డ్ గా మిగిలాడు.ఈ కర్ణాటక బ్యాటర్ గురించి అందరూ మర్చిపోయిన తరుణంలో ఒక్కసారిగా దూసుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో మోత మోగిస్తున్నాడు. 5 మ్యాచ్ ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు చేసి టీమిండియా సెలక్టర్లకు ఛాలెంజ్ విసిరాడు. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 119 బంతుల్లో అజేయంగా 116 పరుగులు చేసి నాలుగో సెంచరీ సాధించాడు. పంజాబ్‌తో మ్యాచ్ లో 139 , అరుణాచల్‌ ప్రదేశ్ పై 100 ,హైదరాబాద్‌పై 124 , సౌరాష్ట్రపై హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌లలో 153.25 సగటు.. 111.66 స్ట్రైక్ రేట్‌తో 613 పరుగులు చేశాడు. మయాంక్ సూపర్ ఫామ్ సెలక్టర్లకు ఒక విధంగా తలనొప్పిగా మారిందనే చెప్పాలి.