ఇద్దరు అమ్మాయిలతో ఒకే మండపంలో పెళ్లి

ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించడం చాలా పెద్ద టాస్క్‌. కానీ ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి ఇద్దరి ఇంట్లో ఒప్పించి ఆ ఇద్దరినీ ఒకే మండపంలో పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తి.

  • Written By:
  • Publish Date - March 29, 2025 / 08:15 PM IST

ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించడం చాలా పెద్ద టాస్క్‌. కానీ ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి ఇద్దరి ఇంట్లో ఒప్పించి ఆ ఇద్దరినీ ఒకే మండపంలో పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తి. ప్రేమికుల సమాజం మొత్తం షాకయ్యే ఈ ఘటన ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో జరిగింది. లింగాపూర్‌కు చెందిన సూర్యదేవ్‌ అనే వ్యక్తి లాల్‌ దేవి, జల్కర్‌ దేవి అనే అమ్మాయిలను ప్రేమించాడు. సూర్యదేవ్‌ ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తున్నాడు అని మొదట ఆ అమ్మాయిలకు తెలియదు. కొంత కాలం గడిచిన తరువాత పెళ్లి ప్రస్తావన రావడంతో వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది. వాళ్లు గొడవ పెట్టుకుని విడిపోతారు అని అంతా అనుకున్నారు. కానీ ఇద్దరు అమ్మాయిలు అంతా షాకయ్యే నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ సూర్యదేవ్‌ని పెళ్లి చేసుకుని కలిసి జీవితంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ వాళ్ల ఇంట్లో పెద్దలను ఒప్పించి ఒకే మండపలంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.