సఫారీల చేతిలో క్లీన్ స్వీప్, పాకిస్తాన్ కు ఐసీసీ షాక్

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు చర్యలు తీసుకుంది.

  • Written By:
  • Publish Date - January 8, 2025 / 02:44 PM IST

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు చర్యలు తీసుకుంది. స్లో ఓవర్‌ రేట్‌ మెయిన్‌టైన్‌ చేసినందుకు గానూ పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం కోత విధించింది. అలాగే ఐదు డబ్ల్యూటీసీ పాయింట్లు కూడా పెనాల్టీ విధించింది. మ్యాచ్‌ నిర్దేశిత సమయం ముగిసే లోగా పాక్‌ ఐదు ఓవర్లు వెనుకపడింది. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్ ప్రకారం.. నిర్దేశిత సమయంలోగా ఓవర్‌ వెనుకపడితే ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజ్‌లో ఐదు శాతం కోత విధిస్తారు. అలాగే ఓ డబ్ల్యూటీసీ పాయింట్‌ డాక్‌ చేయబడుతుంది. ఐసీసీ విధించిన జరిమానాను పాక్‌ సారధి షాన్‌ మసూద్‌ స్వీకరించాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్‌ ఎనిమిదో స్థానంలో ఉంది.