వరల్డ్ క్రికెట్ లో మన హవా, ఐసీసీ ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మంత్‌‌‌‌ గా బుమ్రా

ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదిరిపోయే బౌలింగ్ తో సత్తా చాటిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు గుర్తింపు దక్కింది. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌‌‌‌ గా ఎంపికయ్యాడు.

  • Written By:
  • Publish Date - January 15, 2025 / 05:41 PM IST

ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదిరిపోయే బౌలింగ్ తో సత్తా చాటిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు గుర్తింపు దక్కింది. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌‌‌‌ గా ఎంపికయ్యాడు. ఈ అవార్డుకు బుమ్రా తో పాటు ఆసీస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ ప్యాట్‌‌‌‌ కమిన్స్‌‌‌‌, సౌతాఫ్రికా సీమర్‌‌‌‌ డ్వేన్‌‌‌‌ పీటర్సన్‌‌‌‌ కూడా నామినేట్ అయ్యారు. బుమ్రా డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు.మూడు టెస్టుల్లో అతను 14.22 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. నాలుగు, ఐదో టెస్టుల్లో ప్రతీ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీశాడు. ఓవరాల్ గా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో బుమ్రా 32 వికెట్లు పడగొట్టాడు.ఈ సిరీస్ లో బూమ్రానే హయ్యెస్ట్ వికెట్ టెేకర్. ఆసీస్‌‌‌‌కు 3–1తో సిరీస్‌‌‌‌ అందించిన కమిన్స్‌ 17 వికెట్లు సాధించాడు. అడిలైడ్‌‌‌‌లో అయిదు వికెట్లతో బెస్ట్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ ప్రదర్శన కనబరిచాడు.

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికవడంపై బుమ్రా స్పందించాడు. వ్యక్తిగత అవార్డులు ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇస్తాయన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ద్వారా తనకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని బుమ్రా అవార్డు గెలుచుకున్న తర్వాత చెప్పుకొచ్చాడు. అంతకముందు 2024 జూలై నెలలోనూ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు.

ఆస్ట్రేలియా ప్లేయర్ అన్నాబెల్ సదర్లాండ్‌ కూడా ఐసీసీ మహిళల ప్లేయర్‌ ఆఫ్ ది మంత్‌ అవార్డును ముద్దాడింది. టీమిండియా, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీసుల్లో అదిరే ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా న్యూజిలాండ్ పై సెంచరీ ఇన్నింగ్స్‌ ఆడి సత్తా చాటింది. దీంతో వరుసగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులను సొంతం చేసుకుంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన డిసెంబర్ లో ఈ అవార్డుకు నామినేట్ అయినప్పటికీ ఆమెకు నిరాశే మిగిలింది.