బ్రేకింగ్: మద్యం మత్తులో భార్య, అత్తపై దాడి మియాపూర్‌లో దారుణం

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో కట్టుకున్న భార్య, అత్తపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. మియాపూర్‌లోని జనప్రియ నగర్‌లో ఈ ఘటన జరిగింది.

  • Written By:
  • Publish Date - April 22, 2025 / 06:06 PM IST

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో కట్టుకున్న భార్య, అత్తపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. మియాపూర్‌లోని జనప్రియ నగర్‌లో ఈ ఘటన జరిగింది. క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న మహేష్‌ కొన్నేళ్ల క్రితం శ్రీదేవి అనే అమ్మాయిని లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు.

కానీ కొంత కాలంగా శ్రీదేవి, మహేష్‌ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో నిన్న రాత్రి కూడా గొడవ జరగడంతో ఆవేశంలో మహేష్‌ కత్తితో భార్య అత్తపై దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీదేవికి ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం శ్రీదేవి ఆరోగ్యం నిలకడగానే ఉన్నా.. ఆమె తల్లి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు.