బ్రేకింగ్‌: లవర్‌ కోసం పిల్లలకు విషం పెట్టి ఆడదా ? గాడిదా ?

అమ్మ అనే పదానికే కలకం తీసుకొచ్చిన ఓ కిరాతకురాలి కథ ఇది. ప్రియుడి కోసం కన్న పిల్లలకు విషమిచ్చి చంపింది ఓ కసాయి తల్లి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది ఈ ఘటన.

  • Written By:
  • Publish Date - April 2, 2025 / 03:04 PM IST

అమ్మ అనే పదానికే కలకం తీసుకొచ్చిన ఓ కిరాతకురాలి కథ ఇది. ప్రియుడి కోసం కన్న పిల్లలకు విషమిచ్చి చంపింది ఓ కసాయి తల్లి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది ఈ ఘటన. 45 ఏళ్ల వయసున్న రజితకు 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. రీసెంట్‌గా తన టెన్త్‌ క్లాస్‌ గెట్‌ టుగెదర్‌ మీటింగ్‌లో పాత మిత్తున్ని కలుసుకుంది. కొన్నాళ్లు ఇద్దరూ మాట్లాడుకున్నాక వాళ్ల స్నేహం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

జీవితాంతం ప్రియుడితో ఉండేందుకు భర్త పిల్లలకు విషమిచ్చి చంపాలని నిర్ణయించుకుంది. పెరుగులో విషం కలిపి భర్తకు పిల్లలకు పెట్టింది. కానీ బయట పని ఉండటంతో భోజనం మధ్యలోనే రజిత భర్త చెన్నయ్య వెళ్లిపోయాడు. కానీ ఆ ఫుడ్‌ తిన్న ముగ్గురు పిల్లలు చనిపోయారు. చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు విగత జీవులుగా పడి ఉన్నారు.

రజిత తనకు కూడా కడుపు నొప్పి అని చెప్పడంతో చెన్నయ్య హాస్పిటల్‌లో జాయిన్‌ చేశాడు. మొదట చెన్నయ్యే నేరస్థుడని అంతా అనుకున్నారు. కానీ హాస్పిటల్‌లో పోలీసులు రజితను విచారించడంతో అసలు విషయం బయటికి వచ్చింది. లవర్‌ కోసం తానే పిల్లలను చంపేశానని చెప్పింది రజిత. దీంతో రజిత ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అవ్వగానే రజితను కూడా అరెస్ట్‌ చేస్తామన్నారు.